కేయూ క్యాంపస్
కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం పరిశోధకురాలు జక్కె పద్మ కు డాక్టరేట్ ప్రకటించినట్టు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి. మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. “తిక్కన మహాభారతం – మౌసల నుండి స్వర్గారోహణ పర్వము వరకు-విమర్శనాత్మక పరిశీలన అనే అంశంపై విశ్రాంతాచార్యులు కొండా యాదగిరి పర్యవేక్షణలో పద్మ పిహెచ్. డి పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామానికి చెందిన జక్కె పద్మ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల, నల్లగొండ లో గత పది సంవత్సరాలుగా తెలుగు అధ్యాపకురాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. పలువురు బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు డాక్టర్ పద్మను అభినందించారు.