– మోతె రాజిరెడ్డి టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు
సిరిసిల్ల(నేటి ధాత్రి):
రానున్న రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందని,ప్రత్యక్ష రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషిస్తామని మోతె రాజిరెడ్డి అన్నారు.ఈ సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ తేదీ 7 ఆదివారం హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నిర్వహించే సభకి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత మొదటిసారి హాజరవుతున్న నారా చంద్రబాబు రేపటి సమావేశానికి రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆరే మల్లేశం,తుమ్మనపెళ్లి సత్యం,బైరగొని ప్రవీణ్ గౌడ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
