గంగారం, నేటిధాత్రి :
ఆదివాసి టీచర్ ఫెడరేషన్ తోనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయని జిల్లా అధ్యక్షులు సిద్ధబోయిన బిక్షం అన్నారు. గంగారం మండల కేంద్రంలో జరిగిన ఆ సంఘం సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తదనంతరం మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన కమిటీ మండల అధ్యక్షులుగా సుంచ మహేందర్, ప్రధాన కార్యదర్శిగా ఈసం శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా వాసం రామ్మూర్తి, పినబోయిన సరిత, సహాయ కార్యదర్శిగా బంగారి అనసూర్య, వాసం లక్ష్మి, కోశాధికారిగా మద్దెల రాఘవులు, జిల్లా కమిటీ సభ్యులుగా ఈసం అమర్నాథ్, ఈసం రమేష్, మహిళా జిల్లా కార్యదర్శిగా జారే సత్యవతి, అలెం విజయ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షులు సిద్ధబోయినన బిక్షం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ యొక్క ఎన్నికల పరిశీలకులుగా బిజ్జా సుదర్శన్, ఎన్నికల ఇంచార్జ్ గట్టి సమ్మయ్య లు వ్యవహరించారు.