మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ ఆదేశాల మేరకు, మంగళవారం రోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నందు తెలంగాణ సిద్ధీకర్త శ్రీ కొత్తప్పల్లి జయశంకర్ జయంతి వేడుకలు ఎ ఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ ప్రొఫెసర్ కొత్తపల్లి జయంకర్ తెలంగాణ ఏర్పాటు విషయంలో అహర్నిశలు కృషి చేశారని, 1969 తెలంగాణా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన పుస్తకాలు రాశాడన్నారు. తెలంగాణలోనే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశాడని, జయశంకర్ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశాడని అన్నారు..ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..