లోన్ ఆప్స్ మోసాలతో నష్టానికి గురి కావద్దు
జైపూర్, నేటి ధాత్రి:
జైపూర్ మండలంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బ్యాంకు పథకాల పై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. బ్యాంకు లావాదేవీల గురించి ప్రజలకు వివరిస్తూ ప్రజలు పొందే పథకాలపై క్రాఫ్ లోన్లు దానితోపాటు పొదుపు లోనులు, హౌసింగ్ లోన్స్, ఎడ్యుకేషన్ ,గోల్డ్ లోన్లపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ప్రజలు దీనిని గమనించి బ్యాంకు పథకాలను లోన్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు.సైబర్ మోసాల పై అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ ఈశ్వర్ రెడ్డి, బ్యాంక్ క్యాషియర్స్ సుందర్, సునీత,చెన్నూరు హబ్ మేనేజర్ సంతోష్ శ్రీ వాత్సవ, బ్యాంకు స్టాప్ తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.