మంత్రి పొన్నం బిల్లు ప్రవేశ పెట్టడం శుభ పరిణామం…
నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)గత పాలకుల నిర్లక్ష్య పలితంగా తెలంగాణ రాష్ట్రములో వెనుక బడిన తరగతులవారు తీవ్ర అన్యాయానికి గురైనారని టిపిసిసి ఓబీసీ కోఆర్డినేటర్ తౌటం రవీందర్ అన్నారు.బీసీ కులములో జన్మించడమే ఒక శాపంగా భావిస్తున్న తరుణంలో,ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యా,ఉద్యోగ రిజర్వేషన్ లలో గతములో జరిగిన నష్టాన్ని గుర్తించి బిసి జనగణనకు బిల్లు ప్రవేశ పెట్టిందని సంతోషం వ్యక్తం చేశారు.బిసి గణ న బిల్లుకు ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,బిసి నాయకులు రాష్ట్ర రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు.