నడికూడ,నేటి ధాత్రి:
మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చసుదర్శన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్కూల్ బ్యాంక్ ఆఫ్ చర్లపల్లిని నడి కూడ మండలం తహసిల్దార్ నాగరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.అనంతరం తాహసిల్దార్ మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నప్పటినుండే డబ్బులు పొదుపు చేయడం మరియు బ్యాంకు సేవలు ఏ విధంగా ఉంటాయో తెలియజేయడం చాలా గర్వకారణం అని అన్నారు. అనవసరాల అధుపే పొదుపు అని ఈ సందర్భంగా అన్నారు, సగటు మనిషి ఎప్పుడు రా బడికి తగ్గట్టుగా ఖర్చు చేయాలని చూస్తాడు ఖర్చు చేసిన తర్వాత మిగిలిన దానిని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారని అన్నారు. అనంతరం పాఠశాలలో వివిధ సాంస్కృతి కార్యక్రమాలను చేపట్టారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రమాదేవి, ఆర్ఐ హేమానాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయ అచ్చ సుదర్శన్ ఉపాధ్యాయులు పోలంపల్లి విజేందర్, నిగ్గుల శ్రీదేవి, అంగన్వాడి సూపర్వైజర్ రోజా రాణి ,అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్య, విద్యా వాలంటీర్లు బాపూరావు పరిషవేణి జ్యోతి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.