భద్రాచలం నేటి దాత్రి
భద్రాచలం పట్టణం చప్టా దిగువ ప్రాంతంలో నివాసం ఉంటున్న కారమురి ప్రభాకర్ అనారోగ్యం తో చనిపోవడం జరిగినది. కుటుంబానికి పెద్ద దిక్కు లేకపోవడంతో ఇద్దరి పిల్లలతో పూట గడవడం కూడా కష్టంగా మారింది.
నిరుపేద కుటుంబం కష్టాల్లో ఉందన్న విషయం సమాజ సేవకులు కడాలి నాగరాజు దృష్టికి రావడంతో వెంటనే స్పందించి విషయాన్ని టీచర్ గొర్సా నాగరాజు కి తెలుపగా వెంటనే స్పందించి 5000/- రూపాయలను కడాలి నాగరాజు ద్వారా కష్టాల్లో ఉన్న నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
కష్టాల్లో ఉన్న మాకు ఆర్థిక సహాయం అందించినందుకు కుటుంబ సభ్యులు నాగరాజు కృత్ఞతలు తెలిపారు.