ఏ బి ఎస్ ఎఫ్ డిమాండ్
హనుమకొండ, నేటిధాత్రి:
కాకతీయ డిగ్రీ కళాశాల ఆవరణంలో ఏ బి ఎస్ ఎఫ్ కార్యకర్తల సమావేశం నిర్వహించిన ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఏదైతే ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తు గడువు నేటితో ముగిస్తున్న తరుణంలో చాలామంది నిరుద్యోగులు ఆన్లైన్ సెంటర్ మరియు మీసేవ సెంటర్లకు వెళ్లి దరఖాస్తు చేసుకునె క్రమంలో సర్వర్ డౌన్ సమస్య ఉండడం వలన నిరుద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు .ఇట్టి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉపాధ్యాయ అర్హత దరఖాస్తు పరీక్ష గడువును పొడిగించి నిరుద్యోగులను ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రసాద్, రఘు, శ్రీధర్ ,మురళి మోహన్, బాబు, ప్రశాంత్, వినయ్, రాజు తదితరులు పాల్గొన్నారు.