తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల అంకిరెడ్డిపల్లి గ్రామంలో పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిని పట్టుకున్న తంగళ్ళపల్లి పోలీసులు ఈ సందర్భంగా పోలీసులు తెలియజేస్తూ ఖచ్చితమైన సమాచారం మేరకు తంగళ్ళపల్లి ఎస్సై రామ్మోహన్ పిసి నరేందర్. తో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అంకిరెడ్డిపల్లి శివారులోకివెళ్లగా అక్కడ ఒక ఆటో అనుమానస్పదంగా కనిపించగా పోలీసు ఆధ్వర్యంలో చెక్ చేయగా ఒక ఆటో అప్పి ఆటో నెంబర్ A.P.23.u.6446.. వాహనంలో పిడిఎస్ రైసు ఉండడం గుర్తించడంతో వారిని ఆరా తీయగా డ్రైవర్ పేరు వారణాసి నరేష్ తండ్రి కనకయ్య వయసు 26 కులం బెడ బుడగ జంగాలవారని ఊరు బదనకల్ అని పలు గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ రేషన్ బియ్యాన్ని సేకరించిదుబ్బాక చెందిన విభూది రాజేష్ కి అమ్ముతానని తెలియజేశారు అదే సమయంలో పిడిఎస్ బియ్యం ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా మరో వాహనంలో తరిస్తుండగా పోలీసులు పట్టుకోగా ఆటో నెంబర్. T.S.36.TA..2490.. టాటా యోధ. వాహనంలో 8 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని అలాగే ఆటోలో అక్రమంగా పిడిఎస్ రైసును తరలిస్తూ దందా నిర్వహిస్తున్న విభూదిని రమేష్ ని ఆరా తీయగా పిడిఎస్ బియ్యాన్ని కొనుగోలు చేస్తానని ఒప్పుకోవడం జరిగిందని వెంటనే పలు విషయాలపై విచారించి అతనినీఅరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని ఎవరైనా అక్రమంగా ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని కొన్నచో అమ్మినచో చట్టపరమైన కఠించిన చర్యలు తీసుకుంటూ అట్టి బియ్యాన్ని సీజ్ చేసి కేసును నమోదు చేసి ప్రభుత్వ ఆదేశాల మేరకు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటూ జైలుకు తరలించడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుందని అలాగే ఎవరైనా గ్రామాల్లో ఇలాంటి అక్రమ దందాలకు పాల్పడితే తగిన సమాచారం ఇవ్వాల్సిందిగా గ్రామ ప్రజలనుతంగళ్ళపల్లి మండల ఎస్సై రామ్మోహన్ తెలియజేశారు ఇకముందు అయినా అక్రమార్కులు తమ చేసే పనులు పద్ధతులనుమార్చుకోవాలని తెలియజేశారు లేని ఎడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న పోలీస్ అధికారులను పై సిబ్బంది అభినందించారు