ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్
మందమర్రి, నేటిధాత్రి:-
విద్యార్థులలో భయాన్ని తొలగించి, వారిలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు దాగం శ్రీకాంత్ తెలిపారు. బుధవారం పట్టణంలో టాలెంట్ టెస్ట్ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో ఫిబ్రవరి 26న మండలంలోని పదోతరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎస్ఎఫ్ఐ ఒక్క పక్క విద్యార్థుల హక్కుల కొరకు పోరాడుతూనే, మరోపక్క విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా వ్యాసరచన పోటీలు, పాటల పోటీలు, చిత్రలేఖనం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. గత 25 సంవత్సరాలుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా టాలెంట్ టేస్టులు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు, ప్రైవేట్ పాఠశాలల యజమానులు, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించు టాలెంట్ టెస్ట్ కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాజేందర్, అనిల్, అరవింద్, సాయి కిరణ్, అనిల్, నగేష్, నాగరాజు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.