నిజాంపేట: నేటి దాత్రి, మార్చ్ 23
నిజాంపేట మండల కేంద్రం లో శనివారం నాడు ఉదయం 10 గంటలకు తైబజార్ వేలం పాట వెయ్యడం జరుగుతుందని గ్రామ కార్యదర్శి నర్సింలు అన్నారు. ఈ కార్యక్రమం గ్రామ ప్రత్యేక అధికారి సురేష్ కుమార్ ఆధ్వర్యం లో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వేలం పాటలో పాల్గొనే వారు ముందుగా సెక్యూరిటీ కింద 10 వేల రూపాయలు డిపాజిట్ చేయాలన్నారు. ఏప్రిల్ 1 వతేది నుండి 2025 సంవత్సరం మార్చ్ 31 తేదీ వరకు తైబజార్ కొనసాగుతుందన్నారు.ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.గ్రామ పంచాయతీ నిబంధనలకు లోబడి డబ్బులు వసూలు చేసుకోవాలన్నారు.వేలం లో పాల్గొనే వారికి స్థిరాస్తులు ఉండాలన్నారు. వాటిపై ఎలాంటి అప్పులు ఉండకూడదన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన టార్గెట్ కంటే తక్కువ వేలం లో పాట పడిన యెడల రద్దుచేసి మూడు సార్లు వేలం వెయ్యడం జరుగుతుందన్నారు.