హోసూరు.. వణికిపోతోంది..
తమిళనాడు రాష్ట్రంలోని హోసూరు పట్టణం చతికి గజగజ వణికిపోతోంది. ఇక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు చలితో ఇళ్లనుంచి బయటకు రాలేకపోతున్నారు. అలాగే మంచుకూడా విపరీతంగా పడుతోంది. నిన్న 16 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అదేవిధంగా పగటివేళ సగటు ఉష్ణోగ్రత 18.2 డిగ్రీల సెల్సియ్‌సగా మధ్యాహ్నం 23 డిగ్రీలుగా నమోదైంది. గరిష్ట తేమ వాతావరణం 87.5 శాతంగా ఉంది. చలి తీవ్రతమకు వృద్ధులు మాత్రం బయటకు వెళ్లలేక ఇళ్లకే పరిమితమయ్యారు. బడికి వెళ్లే చిన్న పిల్లలు, విద్యార్థులు స్వెటర్లు ధరించి వెళ్తున్నారు. కర్మాగారాలకు వెళ్లే స్త్రీలు, పురుషులు స్వెటర్లు ధరించి రాకపోకలు సాగిస్తున్నారు.
