జహీరాబాద్:దసరా తర్వాత ఎన్నికల శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
బతుకమ్మ, దసరా పండగల సమయంలో ఎన్నికల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం సరికాదని ఎస్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సాబెర్ అలీ అన్నారు. జహీరాబాద్ లో సోమవారం ఆయన మాట్లాడుతూ పండుగల రోజుల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మహిళా ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బంది పడతారని తెలిపారు. దసరా పండుగ తర్వాతే ఎన్నికల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.