నేటిధాత్రి, వరంగల్
ప్రముఖ ట్రాక్టర్ తయారీ సంస్థ, స్వరాజ్ కంపెనీ వారి 50యేండ్ల వసంతాల ఉద్వేగపు స్వర్ణోత్సవం వేడుకలు శ్రీనివాస్ ఎంటర్ ప్రైసెస్ వరంగల్ వారి ఆధ్వర్యంలో ఎంజీఎం సెంటర్ నుండి నాని గార్డెన్స్ వరకు స్వరాజ్ ట్రాక్టర్ల జ్యోతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉర్సు గుట్ట దగ్గరలోని నాని ఏసి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన స్వర్ణోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. శ్రీనివాస్ ఎంటర్ ప్రైసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబందించిన రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నిర్వహకులు మాట్లాడుతూ భారత దేశంలో స్వరాజ్ కష్టమర్లు 22లక్షలు కలిగి ఉన్నామని, 1100మంది డీలర్లు, 10వేల మంది వరకు సేల్స్ ప్రమోటర్లు ఉన్నారని నిర్వాహకులు తెలిపారు, గత దశాబ్దంలో అతి వేగంగా అభివృద్ధి చెందిన సంస్థ స్వరాజ్ అని అన్నారు. స్వరాజ్ కంపెనీ 50 యేండ్ల వేడుకలను వరంగల్లో చేయడం సంతోషంగా ఉంది అని జోనల్ హెడ్ అమల్ చౌదరి అన్నారు. అనంతరం తెలంగాణ స్టేట్ హెడ్ కన్నన్ మాట్లాడుతూ మొట్ట మొదటి సారిగా భారతదేశ ఇంజనీర్ల ద్వారా, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో స్వరాజ్ ట్రాక్టర్ తయారు చేశామని, 50యేండ్ల వేడుకలను ఘనంగా వరంగల్లో చేయడానికి గల కారణం మాకు గత 47 ఏండ్లుగా శ్రీనివాస్ ఎంటర్ ప్రైసెస్ వారు చాలా సపోర్ట్ చేశారు అని అన్నారు. అనంతరం స్వరాజ్ వారి నూతన ట్రాక్టర్ “స్వరాజ్ టార్గెట్ 630” పేరుతో నూతన ట్రాక్టర్ ను ఘనంగా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వరాజ్ కంపెనీ జోనల్ హెడ్ అమల్ చౌదరి, తెలంగాణ స్టేట్ హెడ్ కన్నన్, శ్రీనివాస్ ఎంటర్ ప్రైసెస్ జనరల్ మేనేజర్ కుమార్, సదానందం, నర్సింహ, స్వరాజ్ కంపెనీ ఉద్యోగులు వరంగల్ టీమ్ మేనేజర్, కృష్ణకాంత్, శ్రీకాంత్, సాగర్, నజీం, ప్రముఖ ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులు, వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతులు, తదితరులు పాల్గొన్నారు.