సార్వత్రిక సమ్మెకు వామపక్ష విద్యార్థి సంఘాల మద్దతు

నూతన జాతీయ విద్య విధానాన్ని రద్దు చేయాలి

మోడీ ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలపై విద్యార్థి లోకం ఉద్యమించాలి

వామపక్ష విద్యార్థి సంఘాలు ఎఐఎస్ఎఫ్,పిడిఎస్యూ

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
భారత్ బంద్ పిలుపులో భాగంగా గుండాల మండల కేంద్రంలో వాపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది , ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే షాహిద్,పిడిఎస్యు భద్రాద్రి కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి భానోత్ నరేందర్ పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా,కార్మిక,విద్యార్థి,యువజన, రైతు,మహిళ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కారణంగా శుక్రవారం దేశవ్యాప్తంగా బందు నిర్వహించమన్నారు.


కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా విద్యార్థి వ్యతిరేక విధానాలను ఆవలంబిస్తూ విద్య కాషాయికరణ, ప్రైవేటీకరణ , కార్పొరేటీకరణ చేస్తూ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా నూతన జాతీయ విద్యావిధానాన్ని తీసుకువచ్చిందని, ఈ నూతన జాతీయ విద్యావిధానం లోపాలపుట్ట అని, విద్యారంగానికి బడ్జెట్ లో నిధులు ఇవ్వకుండా విద్యార్థులకు ఇచ్చే స్కాలర్ షిప్ లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందని, దేశంలో జాతీయ విద్యా విధానం వల్ల దాదాపు 90% విద్యార్థులు నాణ్యమైన విద్య పొందే హక్కును కోల్పోతారని, విద్యా వ్యాపారీకరణ వలన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు సామాజిక న్యాయం దూరం చేసే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్య విధానాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ లో తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఎస్కే నసీర్, రాకేష్, రోహిత్ వినయ్, శ్యామ్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *