మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ప్రహసీత్….
నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ) మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 10వ తరగతి పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులను ఉద్దేశించి మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ప్రహసీత్ ప్రసంగించారు.విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే అంశం లో బాగంగా పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల తో చర్చించారు. ఆత్మవిశ్వాసంతో,ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా నిర్భయంగా పరీక్షలు రాయాలని కోరారు. విద్యార్థులు పాజిటివ్ ఆలోచనలతో మానసిక ప్రశాంతతతో తమ చదువును కొనసాగించాలని, వేకువజామున లేచి చదవడం పట్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుందని, దానితో జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుందని సలహాలు,సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఓదెల మల్లయ్య, ఏటీపీ రవి తో పాటు అధ్యాపకులు,సిబ్బంది పాల్గొన్నారు.