విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు

ఎస్ఐ రేఖ అశోక్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో సాయి చైతన్య ఐపీఎస్ జన్మదిన సందర్భంగా విద్యార్థులకు ప్యాడ్ ల పంపిణీ కష్టపడి చదివి పదవ తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని
విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గణపురం ఎస్ఐ రేఖ అశోక్ అన్నారు. తెలంగాణ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ పోతరాజు సాయి చైతన్య ఐపీఎస్ జన్మదినం సందర్భంగా కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కస్తూర్బా గాంధీ, ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో 50 మంది విద్యార్థులకు ప్యాడ్ లు, పెన్నులు ఇతర సామాగ్రిని ఎస్ఐ రేఖ అశోక్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ అనంతరం సాయి చైతన్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎస్ఐ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెరగాలని అందుకు విద్యార్థులు కష్టపడి చదవాలని ఈ సందర్భంగా సూచించారు. పదో తరగతి పరీక్షల్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసెందుకు సన్నద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ పాఠశాల ఎస్ఓ లావణ్య, ఉన్నత పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు కే. భరత్ కుమార్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు దూలం కుమారస్వామి గౌడ్, కోటగుళ్లు పరిరక్షణ కమిటీ సభ్యుల బృందం పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version