వాహనం బోల్తా12 మంది విద్యార్తినిలకు స్వల్ప గాయాలు.
నేటిధాత్రి, చిట్యాల,
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండల కేంద్రములో శనివారం రోజున 10 వ తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్నా విద్యార్థుల వాహనం బోల్తాపడి విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు, వివరాల్లోకి వెళితే చిట్యాల మండల కేంద్రములో కస్తూర్బా గాంధీ పాఠశాల కు చెందిన 12 మంది విద్యార్తినిలకు స్థానిక సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పరిక్ష సెంటర్ పడింది, వారిని ఒక ప్రయివేట్ టాటా ఎసి వాహనము లో తీసుకువెళుతున్నా క్రమములో పాఠశాల సమీపములో బోల్తాపడింది,గమనించిన పిల్లల తల్లిదండ్రులు వాహనము లో ఇరుక్కున్న విద్యార్తి నిలను వెంటనే బయటికి తీశారు, ఈ సంఘటన లో12 మంది విద్యార్తినిలు స్వల్పంగా గాయపడ్డారు, వెంటనె వారికి చికిత్స చేయించి అనంతరం పరీక్షలకు పంపించారు,దీనితో విద్యార్థులు భయంతో పరీక్షలు హాజరయ్యారు, విద్యార్థులు అంటే ఇంత నిర్లక్ష్యం అని తల్లిదండ్రుల గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు, నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను ఇలా ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లడంతోనే ప్రమాదం జరిగిందని ఒకవేళ ఏమైనా ప్రాణప్రాయం జరుగుతే దీనికి బాధ్యత ఎవరు అని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.