గుడుంబా,గంజాయి, అక్రమ మద్యం విక్రయిస్తే కఠినచర్యలు తప్పవు

ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె. జగన్నాథ రావు

టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా సమాచారం ఇవ్వండి

పరకాల నేటిధాత్రి(టౌన్) సాధారణ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర శాసనసభ 2023 సందర్భంగా ప్రోహిబిషన్ అండ్ ఎక్సెజ్ ఉన్నతాధికార్ల ఆదేశాల నుసారం పరకాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని(6)మండలాలు అయిన పరకాల,నడికూడ దామెర మరియు గీసుగొండ ఆత్మకూర్ శాయంపేట మండలంలో నాటుసారాయి, గంజాయి,అశ్రమ మధ్యం నిల్వలపై కఠినచర్యలు తీసుకుంటున్నట్లు ప్రొహిభిషన్ ఇన్స్పిక్టర్ కె.జగన్నాధరావు తెలిపారు.ఎవరుకూడా అక్రమంగా మధ్యం అమ్మణాలు గానీ,నిల్వలుగానీ మరియు గుడుంబా అమ్మకాలు,మత్తు పదార్థాలు గానీ ప్రభూత్వ నిబంధనలకు విరుద్దమైన చర్యలకు పాల్పడనట్లయితే వారి పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.అలాగే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి బెల్టుషావులు నిర్వహించిన అక్రమంగా మద్యం నిల్వలు, సరఫరా చేపట్టిన కఠినచర్యలు తీసుకుంటామని ఇందుకు సంబందించిన అప్కారి శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయం టోల్ ఫ్రీ నంబర్ 1800 – 425 – 2523, వరంగల్ రూరల్ కార్యాలయం నంబర్ 8702930 190 పరకాల ఎక్స్ప్రెస్ మరియు కార్యాలయం నంబర్ 87126 59017 లకు సమాచారం అందజేయాల్సిందిగా తెలుపుతూ బ్రాందీ షాపులలో జరిగే మద్యం విక్రయాల గురించి ఎలాంటి అనుమానాలు వున్న ఫోన్లలో ని డౌన్లోడ్ చేసుకొని, దీనిలో బాటిల్ వివరాలను స్కాన్ చేసి అది నకిలీ మద్యం అయిన సుంకం చెల్లించని మధ్యం అయిన గుర్తించిన చో పై ఫోన్ నంబర్ల ద్వారా సమాచారం అందించి,ఆప్కారీ శాఖకు సహకరించాల్సిందిగా పరకాల ఎక్సైడ్ ఇస్స్పెక్టర్ కె.జగన్నాధరావు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version