– నకిలీ విత్తనాల విక్రయాలలో తరచూ కేసులు నమోదైతే పీడీ యాక్ట్ అమలు
– నకిలీ విత్తనాల అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించిన సమాచారం పోలీస్ వారికి అందించాలి
– నకిలీ విత్తనాల అక్రమ రవాణా నియంత్రించేందుకు పోలీస్ శాఖ , వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు
– జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్ల, జూన్ – 1(నేటి ధాత్రి):
నకిలీ విత్తనాల అక్రమ రవాణాలను, విక్రయాలను అడ్డుకోవడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీల చేస్తున్నామని, అందులో భాగంగా శనివారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్ల పట్టణంలోని పెద్ద బజార్ నందుగల విత్తన దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఎలాంటి విత్తనాలు అమ్ముతున్నారు,బిల్ రసీదులను, విత్తన సంచులను పరిశీలించి మొదలగు అంశాలపై ఆరా తీశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….
జిల్లాలో నకిలీ విత్తనాల అక్రమ రవాణా, విక్రయాలను అడ్డుకోవడానికి, పోలీస్ , వ్యవసాయఅధికారులచే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందిన్నారు.గతంలో నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, వారియెక్క కదలికలను ఎప్పటికప్పుడు గమనించడం జరుగుతుందన్నారు.నకిలీ విత్తనాలు కలిగి ఉన్నా మరియు అమ్మిన వ్యక్తుల పై పీడీ యాక్ట్ చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందన్నారు.
రాబోవు నెల రోజులు రోజులు చాలా కీలకమని జిల్లాలో ఒక్క రైతుకు కూడా నకిలీ విత్తనాలతో మోసపోకుండా చూసే బాధ్యత వ్యవసాయ అధికారులు పోలీసు అధికారులు పై ఉంటుందని,జిల్లాలో ఉన్న ఫర్టిలైజర్ షాప్, సీడ్స్ షాప్స్ పై నిఘా ఉంచి నకిలీ విత్తనాల విక్రయాలను, రవాణాను అరికట్టడం జరుగుతుందన్నారు.రైతులు సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ షాప్ నుండి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా బిల్ తీసుకోవాలని సూచించారు.
జిల్లా ప్రజలకు, రైతులకు ఎవరైనా నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుల మందులు అమ్ముతున్నారని సమాచారం ఉంటే డయల్ 100 కి లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.
ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రాచరి, సి.ఐ రఘుపతి, సిబ్బంది ఉన్నారు.