వరంగల్ బల్దియా అధికారుల వింత పోకడ?

రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్న నోటీసులు జారీ చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న బాధితులు

నేటిధాత్రి, వరంగల్

వరంగల్ నగర పాలక సంస్థ పరిధి, 12వ డివిజన్ వివేకానంద కాలనీలో, 2022వ సంవత్సరంన ఇంటి నిర్మాణం కోసం బల్దియా నుండి అనుమతి పొందిన కత్తెరశాల భరత్ అనే వ్యక్తి ఇంటిని బల్దియా అధికారులు కూలుస్తం అంటూ నోటీసులు ఇవ్వటం సమంజసం కాదని బాధితుడు తండ్రి కుమార్ ప్రెస్స్ మీట్ నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేది బల్దియా వాళ్ళే, 2యేండ్ల తరువాత వచ్చి అక్రమ కట్టడాలు అంటూ కూల్చడానికి వచ్చేది వాల్లే అని అన్నారు. తాను 2022లో టిబిపాస్ ద్వారా “జి ప్లస్ వన్” ఇంటి నిర్మాణం కోసం అనుమతులు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి తెచ్చుకున్నాను అని అన్నారు. 2024మార్చిలో అక్రమ నిర్మాణం అంటూ నోటీసులు ఎలా జారీ చేస్తారు అని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ప్రశ్నించారు. న్యాయపరంగా అన్ని అనుమతులు ఉన్న నాకు, ఇది రోడ్డు అని, ఎలాంటి ఆధారాలు లేకుండా నిర్మాణాన్ని కూల్చివేస్తామని నోటీసులు ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని అన్నారు. వరంగల్ వివేకానందకాలనీ 100ఫీట్ల రోడ్డులో, రెండు యేండ్ల కిందట తాను ఇంటి నంబర్, బిల్డింగ్ పెర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నట్లు చెప్పారు. 10రోజుల క్రితం బల్దియా అధికారులు, 15రోజుల గడువు ఇస్తూ నోటీసులు పంపారని, దానికి తాను, తన న్యాయవాది ద్వారా అప్పియల్ చేసుకున్నానని, ఇంకా మూడు రోజుల గడువు ఉన్నా కూడా కావాలని ఓ అధికారి ఈరోజు ఉదయం కూల్చి వేయాలని ప్రయత్నిస్తున్నట్లు బాధితుడు మీడియాతో తెలిపారు. ఇరు వైపుల జాగ పత్రాలు చూసి తనకు న్యాయం చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితుడు పిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *