సీపీఐ ఎంఎల్ పార్టీ జిల్లా సెక్రటరీ మారపెల్లి మల్లేష్,
భూపాలపల్లి నేటిధాత్రి
గాజాలో ఇజ్రాయిల్ మారణకాండకు పాల్పడి అక్టోబర్ 7వ తేదీ నాటికి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజున సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ మారపేల్లి మల్లేష్ ఆధ్వర్యంలో నిరసన దినంగా చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
సామ్రాజ్యవాద అమెరికా అండదండలతో ఇజ్రాయిల్ చేస్తున్న దురాక్రమణపూరిత యుద్ధ దాడులతో పాలస్తీనా అతలాకుతలం అయింది. ఉద్దేశ్యపూర్వకంగానే పాఠశాలలు, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ ఈ దాడులకు పాల్పడింది. ఈ అత్యంత క్రూరమైన యుద్ధం వల్ల దాదాపు 41వేల మంది పాలస్తీయన్లు మరణించారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే సమిధలయ్యారు. వీరే కాకుండా భవనాలు, పాఠశాలల క్రింద మరో 10వేల మంది సమాధి అయ్యారు. ఇజ్రాయెల్ పౌరులు హత్యలు, అత్యాచారాలు, దాడులు, కిడ్నాప్లు వంటి అత్యంత హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. అంతర్జాతీయ న్యాయస్థానం దాడులు ఆపాలని కోరినప్పటికీ ఇజ్రాయిల్ పెడచెవిన పెట్టింది.
ఈ దుశ్చర్యకు వ్యతిరేకంగా పాలస్తీనాకు సంఘీభావంగా నిలవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐస విద్యార్థి విభాగం జిల్లా సెక్రటరీ శిలపాక నరేష్ జిల్లా నాయకుడు కన్నూరి రవి పాల్గొన్నారు.