నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలోని
ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి)లో పనిచేస్తున్న వాణిజ్యశాస్త్ర సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం.సోమయ్యకు ఇటీవల రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డు లభించింది.ఈ సందర్బంగా ఆయనకు కళాశాలలో ఘన సన్మానం జరిగింది. అనంతరం సన్మాన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లం నవీన్ మాట్లాడుతూ వాణిజ్య శాస్త్ర సహాయ ఆచార్యులుగా గత 14 సంవత్సరాల నుండి డాక్టర్ ఎం.సోమయ్య విద్యార్థులకు ఎనలేని సేవలనందించారని ఆయన 4 పుస్తకాలు రాయడమే కాకుండా 20 కి పైగా జాతీయ సెమినార్లలో పత్రసమర్పణ చేశారని పేర్కొన్నారు.అలాగే 10 కి పైగా జాతీయ అంతర్జాతీయ జర్నల్స్ లో పరిశోధనా వ్యాసాలు రాశారని, విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థంకావడానికి డిజిటల్ పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి బోధించారని తెలుపుతూ అభినందనలు తెలియచేశారు.ఈ సన్మాన కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు భైరి సత్యనారాయణ,అకడమిక్ కో-ఆర్డినేటర్ డాక్టర్ కందాల సత్యనారాయణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్.కమలాకర్, ఎమ్.ఎమ్.కె.రహీముద్దీన్, డాక్టర్.రాంబాబు, డాక్టర్.భద్రు భూక్య, డాక్టర్.జె.రాజీరు, ఎస్.రజిత, ఆర్.రుద్రాణి, డాక్టర్.డి.సంధ్య, డాక్టర్.బి.గాయత్రి, ఆర్.గణేష్, డాక్టర్.వి.పూర్ణచందర్, బి.వీరన్న, నిజాము, బి.రమేష్, బి.గ్లోరి, ఆర్.మాధవి, జి.అనిత, కార్యాలయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.