భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలంలోని స్థానిక ఏ ఎస్ ఆర్ కాలనీలో, జిమ్ కోచ్ రవి అండ్ టీం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది.
ఈ ముగ్గుల పోటీలకు భద్రాచలం ఎస్సై విజయలక్ష్మి ని ముఖ్య అతిధిగా మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులను గౌరవ అతిథులుగా ఆహ్వానించారు.
ఈ ముగ్గుల పోటీలలో 35 మంది పాల్గొనగా వీరిలో ఫస్ట్,సెకండ్, థర్డ్, ప్రైజులను న్యాయ నిర్నేతలు డిక్లేర్ చేసి వారికి వచ్చిన అతిధుల చేతుల మీదగా బహుమతులు ఇవ్వడం జరిగింది.ముగ్గుల పోటీలలో పాల్గొన్న మిగిలిన వారందరికీ కూడా ప్రోత్సాహక బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కోచ్ జీవీ రామిరెడ్డి మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ అనేది మన తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమైన పండుగని, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో ఈ పండగ వాతావరణం ఎక్కువగా కనిపిస్తుందని, సంక్రాంతి అనగానే ముందు గుర్తు వచ్చేది , అందమైన రంగవల్లికలు, గాలిపటాలు ఎగరవేయడం, అంతేకాకుండా గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కోలాహలం, సాంప్రదాయమైన వస్త్రాలతో, ఆనందకరమైన నృత్యాలతో పల్లె సీమలన్నీ సంతోషంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం టౌన్ ఎస్ఐ విజయలక్ష్మి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ, జీవి రామిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్, గుగులోతు శోభన్ నాయక్ ( ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ ) మహంతి వెంకటకృష్ణాజి ( నేషనల్ సీనియర్ పవర్ లిఫ్టర్ ) మరియు పూర్ణ, కృష్ణ, జిమ్ కోచ్ రవి అండ్ టీం సభ్యులు మరియు కాలనీవాసులు పాల్గొనడం జరిగింది.