కాటారం నేటి ధాత్రి
కాటారం మండలం గుమ్మాలపల్లి గ్రామంలో శనివారం ఎస్సై అభినవ్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై అభినవ్ మాట్లాడుతూ గ్రామాల్లో దొంగతనాలు నివారించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. గ్రామంలో ఏవైనా గొడవలు జరిగినప్పుడు సీసీ కెమెరా ఆధారంగా కేసు నమోదు చేయవచ్చునని తెలిపారు. రాత్రి సమయాల్లో ఏవైనా దొంగతనాలు జరిగితే సీసీ కెమెరాలు ఆధారంగా దొంగను పట్టుకోవచ్చునని పేర్కొన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రజలు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ , పోలీస్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించాలి ఎస్సై అభినవ్
