చాతల్ల సదానందం:కారోబార్ పెంబర్తి
హసన్పర్తి, నేటిధాత్రి:
సర్పంచ్ ఉప సర్పంచ్ పదవి కాలం ముగియడంతో ప్రతి గ్రామాలలో ప్రత్యేక అధికారిని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించడం జరుగుతుంది.ఈరోజు పెంబర్తి గ్రామపంచాయతి ప్రత్యేక అధికారిగా శ్రీ నాగవల్లి శ్రీనివాస్ ఎఈ ఇరిగేషన్ పదవి భాద్యతలు స్వీకరించి విధుల్లో చేరారు ప్రత్యేక అధికారి మాట్లాడుతూ గ్రామప్రజలకు ముఖ్యంగా మంచినీటి సౌకర్యం,పారిశుద్ధ్య పనులు,వీధిలైట్లు నిర్వహణ,గ్రామాభివృద్ధి పనులు చేయాలి దీనికి గ్రామ ప్రజలు సహాయసకారాలు అందించాలి అని అన్నారు.
నూతనంగా భాద్యతలు చేపట్టిన శ్రీనివాస్ ని
పంచాయతీ కార్యదర్శులు,పరకాల హేమలత,గరిగే ప్రశాంతి,కారోబార్ చాతల్ల సదానందం,గారు శాలువాతో ఘనంగా సన్మానం చేసి స్వాగతం పలికినారు.సపాయి రాజయ్య ఉన్నారు.