తరలి రానున్న భక్తజనం!!
బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చైర్మన్ సాన మారుతి!!
ఎండపల్లి నేటి ధాత్రి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా నాటి నుండి నేటి వరకు గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు అశేష భక్తజనం మధ్యలో బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి తరలి వచ్చే భక్తజనులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈ సందర్భంగా శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు పోస్టర్ ను అవిష్కరణ చేసి,అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ సాన మారుతి మాట్లాడుతూ, శ్రీ వేణుగోపాలస్వామి జాతర బ్రహ్మోత్సవాలు,ప్రజా ప్రతినిధులు ,భక్త జనం గ్రామ యువత అందరి సహకారంతో,ప్రముఖ ప్రధాన అర్చకులు ఆరుట్ల రంగాచార్యులు సమక్షంలో భక్తజనులను ఆకట్టుకునే విధంగా దేవుని సైతం మెప్పించే విధంగా తమ పూజ విధానం ఉంటుందని భక్తుల నమ్మకం అలాగే గురువారం రోజున కళ్యాణ మహోత్సవంతో ప్రారంభమై మంగళవారం వరకు వారం రోజులు హోమాలు, పూజలతో, అశేష భక్త జనుల్ని ఆకట్టుకుంటాయి,పూర్వకాలం నుండి చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలను తిలకించి దేవుని వేడుకుంటే అనుకున్న పనులు, కోరికలు నెరవేరుతుందని, వెంటనే కోరికలు తీర్చే వేణుగోపాలస్వామిగా ప్రసిద్ధి కొంతమంది భక్తుల అభిప్రాయం నమ్మకం, ఈ ఆలయానికి ప్రతి రోజు మహిళా భక్తుల పూజలు , భక్తుల్లో విశేష ఆదరణ లభిస్తుంది, అలాగే వివిధ దాతల సహకారంతో రాబోయే సోమవారం రోజున ఉదయం ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహిస్తారని,అదే రోజు సాయంత్రం రథోత్సవం కార్యక్రమం ఉంటుందని,భక్తులందరూ విచ్చేసిస్వామి వారి కరుణ కటాక్షం పొంది స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు అని ఆలయ పాలక మండలి సభ్యులు కోరుతున్నారు, ఈ కార్యక్రమంలోఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సానా మారుతి,ఉపాధ్యక్షులు గుండ గంగయ్య,కోశాధికారి రేణిగుంట శ్రీనివాస్,ప్రచార కార్యదర్శి బుర్ర సాయి కుమార్,మరియు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ యువకులు, భక్తులు పాల్గొన్నారు,