పరకాల నేటిధాత్రి
సోమవారం రోజున అయోధ్యలో జరుగుతున్న శ్రీ బాల రామచంద్ర స్వామి ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం మల్లక్కపేట లో శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఉదయము పంచసూక్త అభిషేకము హవనం మరియు శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అర్చకులు కాటూరి జగన్నాథచార్యులు, శరత్ చంద్ర చార్యులు, రాఘవాచార్యులు,ఆలయ ఈవో వెంకటయ్య మరియు దేవాలయ సిబ్బంది మల్లక్కపేట గ్రామస్తులు భక్తు లు తదితరులు పాల్గొన్నారు.