మరిపెడ,చిన్న గుడుర్ మండల ల ముఖ్య కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం,

డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డి.ఎస్ రెడ్యా నాయక్

కార్యకర్తలు భేదభిప్రాయాలు లేకుండా పనిచేయాలి.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నవీన్ రావు

మరిపెడ నేటి ధాత్రి.

మరిపెడ మున్సిపాలిటీ,రూరల్, చిన్నగూడూరు మండలాల ఆత్మీయ సమ్మేళనం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నవీన్ రావు గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే డి ఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త ను కలవండి ప్రేమ తో ప్రజలను ఓటు అడగండి,మేనిఫెస్టో ను వివరించండి,మన అభివృద్ధి చెప్పండి.అభివృద్ధి అంటే డోర్నకల్ నియోజకవర్గం అనే ల చేశామని చెప్పారు, ప్రతిపక్షాలు ఎం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు,అభివృద్ధి ని ఓర్వ లేని ప్రతిపక్షాలు చిల్లర మల్లారం మాటలు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు అన్నారు,డోర్నకల్ నియోజకవర్గంలో మనకు ఏపార్టీ తో పోటీ లేదు,అన్ని సర్వేలో డోర్నకల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ గెలుపు అని అన్ని సర్వేలో ఆల్రెడీ వెల్లడించాయి అది మన డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. మరిపెడ, చిన్న గూడూరు కార్యకర్తలకు ఎమ్మెల్యే, కార్యకర్త అనుబంధం కాదు. కుటుంబ అనుబంధం మనది అన్నారు, ప్రతి కార్యకర్తను నేను గుర్తుంచుకుంటాను,నేను గెలిచిన అనంతరం నెక్స్ట్ సర్పంచ్,ఎంపీపీ,జడ్పిటిసి, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, ఎన్నికలు ఉన్నాయి.నేను మీకోసం ప్రచారం చేస్తాను మిమ్మల్ని నేను గెలిపించుకుంటాను.మీరు చేసే సేవ రేపు నేను మీకు చేస్తాను,నేను మీకు హామీ ఇస్తున్నాను.ప్రతి ఇంటి గడపకు వెళ్ళండి, వారితో మీరు కలిసి మాట్లాడండి, మనం చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించి చెప్పండి, 2023 మన పార్టీ మేనిఫెస్టో ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలా వివరించి చెప్పాలి అది మన బాధ్యత అన్నారు, మోసానికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ
నాటకాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. అందులో అందరూ సీఎం అభ్యర్థులే, ఒకరిదేమో ఈ నియోజకవర్గమే,సూర్యాపేట నుంచి వచ్చి ఇక్కడ ఏం పీకలేడు అని అది మన నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అని అన్నారు,మరొకరేమో నియోజకవర్గ స్థాయిలో ఎన్ని గ్రామపంచాయతీలు ఉన్నాయి?
ఎన్ని మండలాలు ఉన్నాయి?
ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయని కూడా తెలియని వ్యక్తి మరొకరు?.చావు నోట్లో తల పెట్టి కేసిఆర్ తెలంగాణ సాధించారు.చెప్పింది చేశారు, చెప్పనిది కూడా చేశారు.కేసిఆర్ భరోసా పేరిట మన మెనిఫెస్టో ఉంది. ప్రతి గడప గడపకు మన పథకలను తీసుకువెళ్లి అన్నారు, రైతు బంధు,రైతు భీమా లాంటి పథకాలు ప్రజలకు వివరించాలని అన్నారు, మహిళల ల కు వంట గ్యాస్ భారం కాకూడదు అన్న ఉద్దేశంతో 400 రూ లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాము అన్నారు, రేషన్ కార్డులు ఉన్న వాళ్లకు 6 కిలోల సన్నబియ్యం ఇవ్వబోతున్నాము అన్నారు,
ఏటా 1300 కోట్లు ఎక్కువ ఖర్చు అవుతున్నా సీఎం లెక్క చేయడం లేదు అన్నారు,గురుకులాల్లో ఇప్పటికే సన్నబియ్యం ఇస్తున్నం. ఇకనుండి ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి సన్న బియ్యం పోతున్న మన్నారు,డోర్నకల్ నియోజకవర్గం నిండుకుండ లాగా మార్చింది సీఎం కేసీఆర్,ఆధ్వర్యంలో నేను మీ ఎమ్మెల్యేగా ఉంటూ డోర్నకల్ నియోజకవర్గం రూపురేఖలే మార్చాను.మన నియోజకవర్గం అభివృద్ధి మరింత చేస్తాను.మంచి మెజారిటీ తో గెలిపించాలి అని అభిప్రాయపడ్డారు,కాంగ్రెస్ పార్టీ వాళ్లకు డోర్నకల్ నియోజకవర్గo లో ఓటు అడిగే హక్కు లేదు అన్నారు,కెసిఆర్ పాలనలో సంక్షేమ ఫలాలు అందని ఇల్లే లేదు అన్నారు,ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాలను ప్రజలకు వివరించి చెప్పాలి అన్నారు,రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, నిరంతర కరెంటు,సాగునీరు,తాగునీరు.. ఇవన్నీ ప్రతి ఇంటికి గుర్తు చేయాలి అన్నారు.మనం దేవుళ్ళము కాదు, అందర్నీ కలుపుకొని పోవాలి. ఒకరిద్దరు మిగిలి ఉంటే భరోసా ఇవ్వాలి అన్నారు, కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివ కుమార్ చెప్పారు అన్నారు,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడా 3 గంటల కరెంట్ ఇస్తారు.ఆనాడు ఎరువుల కొరత, కరెంట్ బాధలు, ఎన్నో కష్టాలు రైతులు అనుభవించారు,కాంగ్రెస్ ఏడాదికి 15 వేలు అన్నది.సీఎం కేసీఆర్ ఎకరాకు 16 వేలు ఇస్తామని ప్రకటించారు.ఆసరా పింఛన్లు 5 వేలు ఇస్తామని చెప్పారు,భూమి ఉన్న వాళ్లకు రైతు బీమా ఇస్తున్నట్టు, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కేసీఆర్ బీమా ఇవ్వబోతున్నాం అన్నారు, ఆరోగ్య శ్రీ ద్వారా రూ. 15 లక్షల చికిత్స ఉచితంగా అందించబోతున్నాం అన్నారు,చేసిన పనులు చెప్పండి. ఎండాకాలంలో చెరువులు మత్తడి దుంకుతున్నయి, నిండిన చెరువులు సాక్ష్యం. మరిపెడ నుండి నలువైపులా నాలుగు లైన్ల రోడ్లు చేశాం,ఒకప్పుడు గతుకుల రోడ్లు ఉండేవి.మీరు నేను వేరు కాదు. మీ గౌరవం పెరిగితే, నా గౌరవం పెరిగినట్టే, మరిపెడ మండలం అంటే ఎంతో పేరు ఉంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పై ఉంది అన్నారు, ఛత్తీస్ గడ్ లో ఎకరాకు 13 క్వింటాళ్ల కొంటారు. అది కూడా వానాకాలంలోనే.మనదగ్గర ప్రతికాలం, ప్రతి గింజ లేకుండా కొనుగోలు చేస్తున్నాం అన్నారు,మనం చేసిన పని చెపుదాం.అభివృద్ధి సంక్షేమాన్ని వివరిద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, యువనేత డిఎస్ రవిచంద్ర, స్థానిక మున్సిపల్ చైర్మన్ సింధూర,ఎంపీపీ అరుణ రాంబాబు,జెడ్పిటిసి శారద రవీందర్, చిన్న గూడూరు ఎంపీపీ పద్మ వెంకటరెడ్డి,జెడ్పిటిసి సునీత మురళీధర్ రెడ్డి, కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్, ఒడిసిఎంఎస్ మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డి, క్లాస్ వన్ కాంట్రాక్టర్ రామడుగు అచ్యుతరావు, మండల పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, రామ్ సింగ్, రైతుబంధు కోఆర్డినేటర్ కాలు నాయక్, వైస్ ఎంపీపీ అశోక్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, రెండు మండలాల నుండి వచ్చిన బిఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version