పూజలు.నిర్వహించిన జిల్లా అధ్యక్షులు కేవీ రంగాకిరణ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ నుండి కోర్టుకు వెళ్లే దారిలో సి ఆర్ క్లబ్ దగ్గర, ప్రకాశం స్టేడియం మెయిన్ గేట్ ఎదురుగా
బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ నూతన కార్యాలయములో ఈరోజు కార్తీక మాసం శుభగడియలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు బీజేపీ జిల్లా అధ్యక్షులు కె.వి.రంగాకిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి నూతన కార్యాలయాన్ని త్వరలో అధికారికంగా ప్రారంభిస్తామని తెలిపారు. ప్రారంభోత్సవానికి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నాయకులు హాజరవుతారని తెలిపారు.
ఈకార్యక్రమంలో. ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యవాహ రామచంద్ర రావు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యెడ్లపల్లి శ్రీనివాస్ కుమార్, బిఎమ్ఎస్. నాయకులు మాధవ్ నాయక్ ,వెంకట్ రెడ్డి ,నియోజకవర్గ ఇంఛార్జి టి నరేంద్ర బాబు ,చుంచుపల్లి మండల అధ్యక్షులు రాయుడు నాగేశ్వరరావు ,సుజాతనగర్ మండల అధ్యక్షులు రాజేష్ నాయక్ , రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పైడిపటి రవీందర్ ,జిల్లా అధికార ప్రతినిధి పోనిశెట్టి వెంకటేశ్వర్లు గారు,SC మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి చింతలచెర్వు శ్రీనివాసరావు , ఓబీసీ జిల్లా కోశాధికారి జల్లారపు శ్రీనివాసరావు రావు,ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు గంధం నాగేంద్ర ప్రసాద్ , పాల్వంచ ప్రధాన కార్యదర్శి రాపాక రమేష్ .తదితరులు పాల్గొన్నారు.