•జిల్లా పరిషత్ సీఈవో ఎల్లయ్య
నిజాంపేట: నేటి ధాత్రి
వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రభల కుండా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా పరిషత్ సీఈవో ఎల్లయ్య శుక్రవారం అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పారిశుద్ధ్యని పరిశీలించడం జరిగిందన్నారు. గ్రామపంచాయతీ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో గల రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో రాజు రెడ్డి, గ్రామ కార్యదర్శులు నర్సింలు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.