స్వయం సహాయక సంఘాలకి స్థలం కేటాయించాలి

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల తహసీల్దార్ వనజా రెడ్డికి స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు వినతి పత్రం అందజేయడం జరిగింది.మేజర్ గ్రామపంచాయతీ అయినా జైపూర్ గ్రామంలో సుమారుగా 30 నుండి 40 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలలో సుమారుగా 500 నుండి 600 మంది సభ్యులు ఉన్నారు. ఈ చిన్న సంఘాలతో పాటు గ్రామ సంఘం ప్రతినెల సమావేశాలు సభలు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. గతంలో ఉన్న తహసిల్దార్ కి వెన్నెల గ్రామ సంఘం ఆధ్వర్యంలో సభ్యులు స్థానిక ఐకెపి కార్యాలయం కి దగ్గర 152 సర్వేనెంబర్ పెగడపల్లి శివారులో ప్రభుత్వ భూమి ఉందని వినతిపత్రం ఇచ్చారు. అప్పటి రెవెన్యూ అధికారులు మహిళా సంఘాల నిర్వహణ కొరకు రెండు గుంటల ప్రభుత్వ భూమిని చూపించారు .కానీ నేడు ఆ స్థలం మండలంలోని ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఎటువంటి ఆధారం లేకపోయినా అమ్ముకోవడం జరిగిందని తెలియజేస్తూ బుధవారం రోజున స్థానిక తహసిల్దార్ వనజా రెడ్డికి గ్రామ సంఘ సభ్యులు వినతిపత్రం అందజేశారు. గతంలో అధికారులు మా గ్రామ సంఘం నిర్మాణానికి కేటాయించిన రెండు గుంటల స్థలాన్ని మాకు తిరిగి ఇప్పించాలని అలాగే స్థలమును అక్రమంగా అమ్మిన వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వెన్నెల గ్రామ సంఘం అధ్యక్షురాలు కే .పద్మ, కోశాధికారి మంజుల, గ్రామ సంఘం సభ్యులు సునీత, అంజలి, మంజుల ,వనిత, లక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *