# ఈనెల 29, 30 తేదీలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మ్యాచ్
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా పని చేస్తున్న ఎండీ. జానీపాషా కుమారుడు అష్రఫ్ పాషా అండర్ -16 జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఎన్నికై, ఈనెల 29, 30 తేదీలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్ష్మీకాంత్ అరోరా స్టేడియంలో తన సత్తా చూపించబోతున్నట్లు అధికార కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూనియన్ ఐ.ఎన్.టీ
యూ. సీ- స్టాపు అండ్ వర్కర్స్ యూనియన్ (ఎస్. డబ్ల్యూ. యూ) నర్సంపేట డిపో నాయకులు గొలనకొండ వేణు శుక్రవారం మీడియాకు తెలిపారు.అష్రఫ్ ప్రస్తుతం లక్నెపల్లి బిట్స్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుచున్నాడు. గత నెల హైదరాబాద్ లో జరిగిన అండర్-16 సెలెక్షన్ పోటీలలో తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన వందలాది క్రికెట్ ఆటగాళ్లకు సెలక్షన్స్ నిర్వహించారు. దానిలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన అష్రఫ్ పాషా తెలంగాణ రాష్ట్రం నుండి ఒకే ఒక్క ఆటగాడిగా ఎన్నికవ్వడం విశేషం. ఆయన బ్యాటింగే కాకుండా ఆల్ రౌండర్ స్థాయిలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్ష్మీకాంత్ అరోరా స్టేడియంలో ఈనెల 29, 30 తేదీలలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించబోతున్నాడు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈనెల 29, 30 తేదీలలో అష్రఫ్ ఆడబోయే మ్యాచ్ లో విజయం సాధించాలని కోరుకుంటున్నారు.