ఎమ్మెల్యే, ఎంపీలకు కాలనీవాసుల వినతి
నేటిధాత్రి, వరంగల్
గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ పరిధిలోని, మణికంఠ కాలనీలో నెలకొన్న సమస్యలు తీర్చాలని శుక్రవారం మణికంఠ కాలనీ డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ ఎంపీ కడియం కావ్య లను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు పోతూ చంద్రశేఖర్ మాట్లాడుతూ మణికంఠ కాలనీలో రోడ్లు డ్రైనేజీ, లైటింగ్స్, తదితర సమస్యలను తీర్చాలని ఎమ్మెల్యే నాగరాజు, ఎంపీ కావ్యలను కోరగా వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ 14వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్, మణికంఠ కాలనీ అధ్యక్షుడు పోతు చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు హనుమండ్ల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఓదెల తిరుపతి, కోశాధికారి కంచ మహేందర్, ప్రతినిధులు వెలిశాల రమేష్ బాబు, సూరినేని దేవేందర్ రావు, నల్ల వెంకటేశ్వర్లు, ఆకుతోట రమేష్, కంచ రవి, భరత్, మాధవ రావు, మణికంఠ కాలనీ కాంగ్రెస్ అధ్యక్షుడు కంచ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.