సామాజిక న్యాయస్ఫూర్తితో విఏసిసి పనిచేస్తుంది
విఎసిసి చైర్మన్ మోతె రాజలింగు
రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 20, నేటిధాత్రి:
సామాజిక న్యాయం నేటి సమాజంలో కనబడడం లేదని విజిలెన్స్, యాంటీ కరప్షన్ కౌన్సిల్ చైర్మన్,న్యాయవాది మోతె రాజలింగు అన్నారు. మంగళవారం ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవ సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. దేశానికి స్వాతంత్రం వచ్చి ఏండ్లు
కావొస్తున్న..సామాజిక న్యాయం అందనిద్రాక్ష గానే మిగిలిందిన్నారు. సామాజిక న్యాయస్ఫూర్తితో రూపుదిద్దుకున్న రాజ్యాంగంపై ప్రమాణం చేస్తూ.. అధికారంలోకి వస్తున్న పాలకులు.. ఆ స్ఫూర్తిని మరుస్తున్నారని ఆయన అన్నారు. దేశంలో ఉన్న ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక రాజకీయ సాంస్కృతిక రంగాల్లో సమన్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.దేశ వనరులు, సంపదపై ప్రజలందరికీ సమాన వాటాలు దక్కడమే సామాజిక న్యాయమని ఆయన అన్నారు. సామాజిక న్యాయం పై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. సామాజిక న్యాయస్ఫూర్తితోనే విఏసిసి పనిచేస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో విఏసిసి సభ్యులు దుర్గం వెంకటేష్, మాదాసు శ్రీకాంత్ యాదవ్, కలవల సతీష్ కుమార్, అరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.