వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనుట
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో ఒక్కసారిగా బుధవారం తెల్లవారుజామున రహదారిని పొగ మంచు కమ్మేసింది. దట్టంగా కమ్ముకున్న మంచులో ఇల్లు కనిపించలేదు. దగ్గర దగ్గరగా ఉన్న మనిషికి మనిషి కనిపించని పరిస్థితి నెలకొంది.దీంతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. పట్టపగలే హెడ్ లైట్ వేసుకుని నెమ్మదిగా నడుపుకుంటూ వెళ్తున్నారు. పరకాల- హనుమకొండ హైవే మీద భారీ వాహనాలు రోడ్డు పక్కకు నిలుపుకున్నారు 10 గంటల తర్వాత ప్రయాణం కొనసాగించారు. భారీ వాహనాలు ఉదయం 10 గంటల తర్వాత పొగ మంచు తగ్గడంతో ఊపిరి పీల్చు కున్నారు.