మరుగుదొడ్లు,టాయిలెట్లు లేక విద్యార్థుల ఇబ్బందులు-మంద శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధానకార్యదర్శి
పరకాల నేటిధాత్రి మంగళవారం రోజున హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం కళాశాల ప్రిన్సిపల్ తో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని కోరారు.ఈ సందర్భంగా మంద శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేలన్నారు. గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ కూడా నెరవేర్చలేదన్నారు.ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు అయినటువంటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు అనేకమైన సమస్యలతో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు.అలాగే పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు టాయిలెట్స్ మరుగుదొడ్లు,ఎస్ఎం హెచ్ హాస్టల్స్ కు సొంతభవనాలు లేవని అద్దె భవనల్లో ఉంటూ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య రంగ సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే పరిష్కరించాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు ఉదృతం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పరకాల మండల అధ్యక్షులు మడికొండ ప్రశాంత్,పట్టణ అధ్యక్షులు బొచ్చు ఈశ్వర్, సాయి,సందీప్,అవినేష్,చింటూ,రాజ్,శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.