ఎండపల్లి జగిత్యాల నేటి ధాత్రి
మండల కేంద్రంలోని రాజరాం పల్లి ఎస్ఆర్ గార్డెన్లో నిర్వహించిన బ్యూటీషియన్ బ్యూటీ వెల్నెస్ సెమినార్ కార్యక్రమం పలువురి మహిళల్ని ఆకట్టుకుంది, కోలుముల దామోదర్ యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, సక్సెస్ సంస్థ వారి బ్యూటీ సొల్యూషన్ సహాకారంతో,బ్యూటీ వెల్నెస్ సెమినార్ నైపుణ్య కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి శ్రీమతి కాంత కుమారి హాజరై ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది,చుట్టూ పరిసర ప్రాంతాల నుండి సుమారుగా 260 మంది ఉత్సాహంతో మహిళా మనులు వచ్చారు సంస్థ తరఫున ప్రతినిధులు హాజరై మోటివేషన్ కార్యక్రమాలు నిర్వహించినారు ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ మహిళలకు ఆత్మవిశ్వాసం అనేది అందంతోనే పూర్తిగా నిలబడుతుందని ప్రతి ఒక్క మహిళ రాబోయే రోజుల్లో తన జీవనాన్ని సొంతంగా ఉపాధి ఏర్పరచుకోవడానికి అన్ని విధాలుగా స్పష్టమైన సురక్షితమైన అందం పరిష్కారాలు , మార్గాలు పైన చక్కగా వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కొలుముల దామోదర్ యాదవ్ ఫౌండేషన్ కన్వీనర్ జంగం మహేందర్ సభ్యులు సంగ రంజిత్ వేల్పుల నాగరాజ్ జిల్లా సంపత్ ఆవుల మహేష్ తాజా మాజీ సర్పంచ్ గెల్లు చంద్రశేఖర్ యాదవ్ పలువురు మహిళా మణులు పాల్గొన్నారు