మందమర్రి, నేటిధాత్రి:-
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) మండల నూతన అధ్యక్షునిగా ఆసంపల్లి శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలోని సారంగపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జ్ జీడి సారంగం, పట్టణ కన్వీనర్ చిలుముల రాజుకుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జ్ గుండా థామస్ మాదిగ, జిల్లా అధ్యక్షులు చెన్నూరు సమ్మయ్య మాదిగలు హాజరైయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎమ్మార్పీఎస్ గౌరవ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జిల్లాలోని మండలాలకు నూతన కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. మాదిగలంతా ఐక్యంగా ఉండి, ఎస్సీ వర్గీకరణ సాధించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మార్పీఎస్ మండల నూతన కమిటీని ఎన్నుకొని, సభ్యులను అభినందించారు. ఎమ్మార్పీఎస్ మండల గౌరవ అధ్యక్షునిగా రాజర్ల సురేష్, అధ్యక్షునిగా ఆసంపల్లి శివకుమార్, ప్రధాన కార్యదర్శిగా వేల్పుల సుధాకర్, ఉపాధ్యక్షుడిగా మెరుగు ప్రభాకర్, కార్యదర్శిగా ఆసంపల్లి అఖిల్, కోశాధికారిగా తైదల మారుతీ లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ, తమపై నమ్మకంతో పదవి బాధ్యతలు అప్పగించిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర, జిల్లా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పెరిక నరసయ్య, జిలకర శంకర్, నాయకులు ఆసంపల్లి అనిల్, మాడుగుల రాజ్ కుమార్, అక్కపాక రాజ్ కుమార్, ఆసంపల్లి రాంష్ కుమార్, బచ్చలి రాములు, బచ్చలి కిషోర్, గార కుమార్ తదితరులు పాల్గొన్నారు.