అంబేద్కర్ యువజన సంఘం పట్టణ ఉపాధ్యక్షుడు కల్లేపల్లి విక్రమ్
ఏచూరి చిత్రపటానికి నివాళులు
లక్షేట్టిపేట్ (మంచిర్యాల) నేటిధాత్రి:
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అంబేద్కర్ యువజన సంఘం పట్టణ ఉపాధ్యక్షుడు కల్లేపల్లి విక్రమ్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏచూరి చిత్ర పటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ఏచూరి జీవితం తెరిచిన పుస్తకం లాంటిదన్నారు. భూమి, భుక్తి, పీడిత జన విముక్తి కోసం పోరాడిన మహానీయుడన్నారు. యుపీఏ హయాంలో కామన్ మినిమం ప్రోగ్రాం ద్వారా ఎంతో మందికి ఉపయోగ పడుతున్న ఈజీఎస్ లాంటి పథకాలను ప్రభుత్వాలకు సూచించారన్నారు. పేదల పక్షాన పార్లమెంట్ లో శాస్త్రీయ బద్దంగా పోరాడన్నారు. పేదల పక్షాన మాట్లాడే గొంతు మూగబోవడం చాలా బాధాకరం అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శనాల నవీన్ కుమార్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్, యూత్ నాయకులు దర్శనాల రమేష్, ఊరేడి రాజ్ కుమార్, దర్శనాల చంద్రయ్య, మడిపెల్లి వెంకటేష్ పాల్గొన్నారు