సిరిని జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక

పాఠశాల ప్రిన్సిపాల్ , ఉపాధ్యాయులు ప్రశంసలు

శాయంపేట నేటి ధాత్రి :                          

శాయంపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలిక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జె. సిరి రాష్ట్రస్థాయి క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ సుభాషిని దేవి తెలిపారు. ఈనెల 19, 20 న మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో పదో తరగతి చదువుతున్న నవ్య శ్రీ, దివ్యశ్రీ, 9వ తరగతి చదువుతున్న కృష్ణవేణి, సిరి, రజిత లు పాల్గొన్నారు. సిరిలోని ప్రతిభను గుర్తించి జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక చేసినట్లు క్రీడల కోచ్ ప్రకటించారు. సిరిని పాఠశాల ప్రిన్సిపాల్ సుభాషిని దేవి, వైస్ ప్రిన్సిపాల్ వసంత, పిఈటి అమృత, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version