రామకృష్ణాపూర్ ,మార్చి 22, నేటిధాత్రి:
ఆర్థిక సంవత్సరానికి సాధించాల్సిన బొగ్గు ఉత్పత్తి, రవాణ లక్ష్యాలను సాధించడానికి గాను ఓఎస్డిగా నియమించిన ఎస్.డి ఎం.సుభాని మందమర్రి ఏరియా ను సందర్శించారు. మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఏ.మనోహర్, జి.ఎం (ఆర్ అండ్ డి) ఎస్.డి ఎం.సుభాని ఆర్కే ఓ.సి ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..ఈ ఆర్థిక సంవత్సరం మిగిలిన పని దినాలలో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి , రవాణా లక్ష్య సాధనకు తీసుకోవలసిన చర్యలపై సంబంధిత ప్రాజెక్టు ఆఫీసర్లకు,మేనేజర్లకు, ఇతర అదికారులకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్.కె.ఓ.సి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏం.గోవిందరావు, ఆర్.కె.ఓ.సి మేనేజర్, సుధీర్ జక్కులవార్, ఎం.శేఖర్ సీనియర్ సర్వే ఆఫీసర్, పి.మహేందర్ ప్రాజెక్ట్ ఇంజనీర్, కె.రామరాజు ఆర్కె.ఓ.సి సేఫ్టీ ఆఫీసర్, కే.కే ఒ.సి ప్రాజెక్టు ఆఫీసర్ రమేశ్, ప్రాజెక్ట్ ఇంజనీర్ సూర్య నారాయణ రాజు పాల్గొన్నారు.