సికిల్ సెల్ అనీమియా ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసి గిరిజన గూడెంలలోని గిరిజన పిల్లలకు ఎక్కువ

భద్రాచలం నేటి ధాత్రి

వారసత్వంగా సంక్రమిస్తుందని వ్యాధి లక్షణాలు సంక్రమించిన పిల్లలనుంచి పెద్దల వరకు త్వరగా గుర్తించి సరైన వైద్య చికిత్సలు తీసుకుంటే వెంటనే నయమైపోతుందని భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు అన్నారు.
బుధవారం నాడు ప్రపంచ సికిల్ సెల్ అనిమియా దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన జిల్లా కలెక్టర్ మరియు ఇతర శాఖల అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సికిల్ సెల్ అనీమియా వ్యాధి ప్రాణాంతకమైనది కాదని, ఈ వ్యాధి జన్యుపరంగా కాకుండా తల్లిదండ్రుల నుండి సంక్రమిస్తుందని ముఖ్యంగా మన శరీరంలో ఎర్ర రక్త కణాలు 120 రోజులకి నశించి తిరిగి కొత్త రక్త కణాలు వస్తుంటాయని,ఈ వ్యాధి సోకిన వారికి 20 రోజులలోనే ఎర్ర రక్త కణాలు నశించి మన శరీరానికి అంతా పాకిపోయి రక్తహీనత, విపరీతమైన నొప్పి, చేతులు కాళ్లు వాపు, ఇన్ఫెక్షన్లు రావడం, పెరుగుదలలో జాప్యం జరగడం, దృష్టి సమస్యలు, అవయవ నష్టం, అంధత్వం, తీవ్రమైన చాతినొప్పి గుండె జబ్బులు, అల్సర్ వంటి వ్యాధులు సంభవిస్తాయని, త్వరగా గుర్తించి సరైన చికిత్సలు చేసుకుంటే ఎటువంటి వ్యాధులు దరి చేరవని అన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ముందుగా సికిల్ సెల్ అనిమీయ టెస్టింగులు చేయించుకోవాలని ,పొరపాటున వ్యాధి లక్షణాలు కనిపిస్తే సరైన వైద్యం తీసుకుంటే పుట్టే బిడ్డ ఆరోగ్యవంతులుగా పుడతారని అన్నారు. ఆదివాసి గిరిజన గ్రామాలలో ఈ వ్యాధి గురించి ఎక్కువగా గిరిజనులకు అవగాహన కల్పించి తప్పనిసరిగా సికిల్ సెల్ అనిమీయ టెస్టింగులు చేయించుకునే విధంగా వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనులు ఎక్కువ శాతం మూఢనమ్మకాలను నమ్మి సరైన వైద్యం చేయించుకోలేరని వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భారత ప్రభుత్వం గిరిజన మంత్రిత్వ వ్యవహారాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గిరిజన సంక్షేమం కొరకు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం నేటి నుంచి పది రోజుల వరకు అన్ని పీహెచ్సీలలో, సబ్ సెంటర్లలో, అంగన్వాడి సెంటర్లలో, పాఠశాలల్లో ముఖ్యమైన కూడళ్లలో సికిల్ సెల్ అనీమియా టెస్టింగ్లు నిర్వహిస్తారని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెస్టింగులు చేయించుకొని వ్యాధి లక్షణాలు ఉంటే సరైన చికిత్సలు తీసుకోవాలని ఆయన అన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ ఆదివాసి గిరిజన గ్రామాలలోని గిరిజన పిల్లల కొరకు ఈ యొక్క కార్యక్రమం ప్రత్యేకంగా రూపొందించబడినదని, జూలై 2023 నుండి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని, 2047 సంవత్సరం నాటికి ట్రైబల్ ఏరియాలోని గిరిజనులకు ఎటువంటి వ్యాధులు శోక కుండా ముఖ్యంగా సికిల్ సేల్ అనిమీయ వ్యాధిని పారదోలడానికి ఈ మహత్తర కార్యాన్ని చేపట్టడం జరిగిందని, అదేవిధంగా 17 రాష్ట్రాల్లో ప్రభావితం అయిన ఈ వ్యాధిని నామరూపం లేకుండా చేయడానికి ముఖ్యంగా 0 నుండి ఆయన 40 సంవత్సరాలు లోపు ప్రజలకు ముఖ్యంగా గిరిజనులకు స్క్రీనింగ్ టెస్టులు చేయించాలని అన్నారు. ఆదివాసి గిరిజన గూడెంలలో మంచినీరు సరిగా లభ్యం గాని గ్రామాల వారికి తప్పకుండా ఈ వ్యాధి సంక్రమిస్తుందని, అటువంటి చోట తప్పనిసరిగా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా క్యాంపులు నిర్వహించి ప్రతి ఒక్కరికి స్కానింగ్ టెస్ట్ లు నిర్వహించాలని అన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో, ఈఎంఆర్ ఎస్, గురుకుల పాఠశాలలో, జిల్లా పరిషత్ పాఠశాలల్లో, అంగన్వాడి స్కూల్ లలో, చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు తప్పనిసరిగా మీ తల్లిదండ్రులకు మరియు మీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అవగాహన కలిగించి సికిల్ సెల్ అనీమియా టెస్టులు చేయించుకునే విధంగా చూడాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ తరపున 2700 టెస్టింగ్ కిట్లు సరఫరా చేసామని ,రోజుకి 25 మంది చొప్పున అన్నిచోట్ల టెస్టింగులు నిర్వహించి అందరికీ చికిత్సలు అందిస్తారని ఈ యొక్క కార్యక్రమం 15 రోజులలో పూర్తి చేయడానికి సంకల్పించామని, కావున అధికారులు ,అనధికారులు విద్యార్థిని విద్యార్థులు అందరూ వైద్యశాఖ సిబ్బందికి సహకారం అందించి సికిల్ సెల్ అనీమియా వ్యాధి దరిచేరకుండా చూడాలని ఆయన అన్నారు.
అనంతరం గిరిజన సంక్షేమ శాఖ ట్రైకర్ జిఎం శంకర్రావు మాట్లాడుతూ సికీల్ సెల్ వ్యాధి అనేది హిమోగ్లోబిన్ చేసే రుగ్మతల యొక్క సమూహమని, హిమోగ్లోబిన్ శరీరంలోని వివిధ కణాలకు ఆక్సిజన్ సరఫరా చేయడంలో బాధ్యత వహిస్తుందని, అసాధారణమైన హిమోగ్లోబిన్ మొలిక్యుల్స్ అణువుల వలన వారసత్వంగా సంక్రమించే ఒక రుగ్మత అని, ఇది ఎర్ర రక్త కణాలను కొడవలి లేదా చంద్రవంక ఆకారంలోకి మారుస్తుందని, సికిల్ కణాలు వొంగే గుణాన్ని తక్కువగా కలిగి ఉంటాయని అందువలన చిన్న రక్తనాళాల గుండా వెళుతున్నప్పుడు అవి పగిలిపోయి విచ్ఛిన్నమైపోతాయని, దీని ఫలితంగా ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గి రక్తహీనతకు దారితీస్తుందని ఆయన అన్నారు. ఈ వ్యాధి సంక్రమించకుండా ఉండాలంటే ప్రతి రోజు క్రమం తప్పకుండా నీటిని పుష్కలంగా తాగాలని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, హిమోగ్లోబిన్ కు మేలు చేసే పండ్లను ఎక్కువ శాతం తీసుకోవాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని అన్నారు. ఈ విధంగా జాగ్రత్తలు పాటిస్తే ఎటువంటి రోగాలు దరి చేరవని ఆయన అన్నారు.
అనంతరం సికిల్ సెల్ అనిమీయ టెస్టింగులు చేయించుకున్న గర్భిణీ మహిళలకు కార్డులు అందించారు.
ఈ సందర్భంగా సికిల్ సెల్ అనీమియా బ్రోచర్స్ పాంప్లెంట్లు మరియు టెస్టింగ్ కి సంబంధించిన మెడికల్ క్యాంపును పరిశీలించారు. సికిల్ సెల్ అనిమీయ లక్షణాలు ఏ విధంగా ప్రజలకు సోకుతుంది అనే అంశాల గురించి కళాజాత ద్వారా విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ ,ఆర్డీవో దామోదర్ రావు,డి ఎం హెచ్ ఓ శిరీష ,డిడి ట్రైబల్ వెల్ఫేర్ మణెమ్మ ,ఎడిఎంహెచ్వో భాస్కర్ ,ఏసీఎంవో రమణయ్య, ఏపీవో పవర్ మునీర్ పాషా, డిటిఆర్వైఎఫ్ఆర్ శ్రీనివాస్ ,ఎస్ఓ సురేష్ బాబు, మరియు ఇతర శాఖల అధికారులు వైద్య సిబ్బంది వీడి కళాశాల విద్యార్థినిలు తదితరులు పాఠశాల విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.
అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయము భద్రాచలం నుండి జారీ చేయడం అయినది

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version