శ్యామ ప్రసాద్ ముఖర్జీ బాటలో నడవాలి.

– చెన్నమనేని వికాస్ రావ్

చందుర్తి, నేటిధాత్రి:

భారతీయ జనసంగ్ వ్యవస్థాపకులు శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా చందుర్తి మండలకేంద్రంలో బీజేపీ వేములవాడ నియోజకవర్గం అభ్యర్థి డాక్టర్ చెన్నమనేని వికాస్ మొక్కను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత శ్యామ ప్రసాద్ ముఖర్జీ బాటలో నడవాలని, కుటుంబంతో పాటు దేశాన్ని కూడా పరిరక్షించాలని, వారి సేవలు ఇప్పటికీ సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో వివరించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని అన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్, మండల అధ్యక్షులు పొంచెట్టి రాకేష్, ప్రధాన కార్యదర్శులు చింతకుంట గంగాధర్, చిర్రం తిరుపతి, నాయకులు పెరుక గంగరాజు, రాంరెడ్డి వెంకట్ రెడ్డి, వంకాయల కార్తీక్, బందెల వెంకటేష్, ఆది రవి, అంబాల శ్రీకాంత్, గడికొప్పుల జీవన్, మొకిలే విజేందర్, బోరుగాయ తిరుపతి, సాన జలందర్, పెరుక రంజిత్, ఎల్లల తిరుపతి రెడ్డి, నేతికుంట బాలరాజు, బొంబోతుల ప్రశాంత్, మరుపాక దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version