నేడు శ్రీ మత్స్యగిరిస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభం

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేటమండల కేంద్రంలోని శ్రీ మత్స్యగిరి స్వామి కలియుగంలో కోరిన కోర్కెలు తీర్చే దైవముగా ప్రసిద్ధిగాంచిన కాకతీయ రాజుల కళా వైభవానికి ప్రత్యేకగా నిలిచిన మత్స్యగిరి స్వామి ఆలయం


ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి పంచమ రాత్రి ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ మత్స్యగిరి స్వామి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది .ఆ క్రమంలో మంగళవారం నుండి శనివారం వరకు నిర్వహించుటకు చలువ పందిళ్లు వేసి ఏర్పాట్లు చేసినట్లు దేవాలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు.ఆలయ చరిత్ర శాయంపేట గ్రామ పొలిమేరలోని మచ్చర్లగుట్టపై శ్రీ మత్స్యగిరి స్వామి ఆరు శతాబ్దాల క్రితం 568 సంవత్సరాల క్రితం కొలువు దీరినట్లు పూర్వీకులు పేర్కొంటున్నారు.మహావిష్ణువు దుష్టశిక్షణకై దశావతారాలలో భాగంగా మొదట మత్స్యవతారంగా వెలసినట్లు చెబుతున్నారు మచ్చర్లయగుట్ట వద్ద గ్రామ్య భాషలో శాలివాహన శకంలో వేయించిన శిలాశాసనం ద్వారా ఆనాటి దేవాలయ చరిత్ర తెలియజేస్తుంది గుట్ట లోపల బండరాయిపై సహజ సిద్ధంగా మచ్చా అవతారంలో దర్శనమిస్తారు ఈ గుట్ట లోపటికి వెళ్లేందుకు ఒకే ఒక చిన్న మార్గం ఉంటుంది ఇక్కడ 14 దేవాలయాలు 24 మంది అర్చకులు ఉండేవారని ఈ శిలా శాసనం ద్వారా తెలుస్తుంది అప్పుడు నిర్మించిన దేవుని చెరువు నేటికీ అదే దేవుని చెరువు పేరుతో పిలువ బడుతున్నది.కాకతీయ సామంత రాజు కొత్త గట్టు సీమ పాలకుడు రేచర్లదర్శనాయుడు తన తల్లిదండ్రులు సింగమాంబ సింగమ నాయుడు దేవాలయం నిర్మించినట్లు తెలుస్తుంది కాలక్రమంలో మచ్చర్లయ గుట్ట వద్ద నుంచి గ్రామం దూరంగా వెళ్లిపోయింది గ్రామం మధ్యలో రాతితో శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయాన్ని నిర్మించారు దేవాలయ గోపురం పైన మహావిష్ణువు దశావతారాలు భక్తులకు దర్శనమిస్తాయి.
కల్యాణోత్సవ కార్యక్రమం మే 21 మంగళవారం ఉదయం తోలక్కం ప్రారంభం పుట్ట బంగారు సేవ మధ్యాహ్నం ధ్వజారోహణం గరుడ ముద్దా (సంతానం లేని దంపతులు గరుడ ముద్ద ప్రసాదం స్వీకరించగలరు) సాయంత్రం ఎదురుకోళ్లు తేదీ 22 బుధవారం ఉదయం 11 గంటలకు కళ్యాణోత్సవం మధ్యాహ్నం ఒంటిగంటకు మహా అన్నదాన కార్యక్రమం తేదీ 23 గురువారం ఉదయం పూర్ణాహుతి సాయంత్రం 6 గంటలకు గజవాహన సేవ గుట్టమీదికి పోవడం తేదీ 24 శుక్రవారం సాయంత్రం రథోత్సవం అలుకతీరుట తేదీ 25 శనివారం ఉదయం చక్ర వరీ సాయంత్రం నాకబలి నాగవల్లి పండిత సన్మానం తో ఉత్సవాలు ముగిస్తాయని దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version