కేయూ క్యాంపస్
కాకతీయ విశ్వవిద్యాలయం ప్రభుత్వ పాలన శాస్త్రం విభాగం పరిశోధకుడు నిమ్మనగోటి శంకర్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. “ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వెల్ఫేర్ మేజర్స్ అండ్ రెహబిలిటేషన్ స్కీమ్స్ ఫర్ విజుల్లీ డిస్సాబ్లెడ్ ఇన్ తెలంగాణ స్టేట్:” ఏ స్టడీ అనే అంశంపై ఆ విభాగం విశ్రాంత ఆచార్యులు పింగళి నరసింహ రావు పర్యవేక్షణలో పరిశోధనాత్మక గ్రంథాన్ని యూనివర్సిటీ కి సమర్పించినందుకు గాను డాక్టరేట్ ప్రకటించినట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి.మల్లారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పరడ గ్రామానికి చెందిన శంకర్ పుట్టుక తోనే అంగవైకల్యం కలగడంతో సమాజంలో ఎన్నో రకాల ఇబ్బందులు కలిగిన కృంగిపొకుండ యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్ గా సేవలందిస్తూనే, అంతటితో ఆగకుండా పరిశోధన మీద ఆసక్తితో మనిషిని మనిషిగా చూడని ఈ సమాజంలో అందుల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం అందని ద్రాక్ష అవుతుంది. అందుకే వికలాంగుడైన శంకర్ అందుల సమస్యల పై పరిశోధన చేసి నూతన సమాజ నిర్మాణానికి బాటలు వేసాడు. కృషి, పట్టుదలతో తన అంగవైకల్యాన్ని జయించి గొప్ప పరిశోధన చేసి ఈ సమాజంలోని వికలాంగుల కు ఆదర్శంగా నిలవడమే కాకుండా వికలాంగుల్లొ మనో ధైర్యాన్ని నింపిన శంకరును ఆ విభాగ బోధన, బోధన సిబ్బంది మరియు పరిశోధకులు అభినందించారు.
