మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టాలి

సిఐటియు జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి.

కాశిబుగ్గ నేటిధాత్రి

సిఐటియు వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ బట్టల బజారు చౌరస్తా లో బీటు బజార్లో వివిధ షాపులలో పనిచేస్తున్న మహిళా కార్మికులను వారి సమస్యలపై సర్వే నిర్వహించడం జరిగింది.
ఈ సర్వే కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మహిళలపై కొనసాగుతున్న వివక్షతను రూపుమాపాలని పురుషులతో మహిళలను సమానంగా చూడాలని అన్నారు. మహిళలపై అన్ని రకాల వివక్షతను హింసను అంతరం చేయడానికి మరియు పని ప్రదేశాల్లో, మహిళలకు భద్రత కల్పించడానికి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సిఐటియు తరఫున డిమాండ్ చేస్తున్నాం. గత కొద్ది రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ లో రాష్ట్ర రాజధాని కోల్ కత్తా నగరంలోని ఆర్జీ కార్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ట్రైనీ డాక్టర్ పై ఇటీవల జరిగిన దారుణమైన అత్యాచారం మరియు హత్య ఘటనలను మరియు మహారాష్ట్రలోని బాల్దులాపూర్ తానే లో నాలుగేళ్ల చిన్నారులపై అత్యాచారం, యూపీలో నర్స్ పై అత్యాచారం, హత్య అస్సాంలో అమ్మాయిపై సామూహిక అత్యాచారం, ఉత్తరాఖండ్ లోని డేహ్రడూన్ ల్ బస్సులో జరిగిన మరో ఘటన కొద్ది రోజుల వ్యవధిలోనే జరిగిన ఈ సంఘటనను దేశంలో మహిళల్లో,చిన్న పిల్లలలో వారి తల్లిదండ్రుల్లో బయటకు పంపాలన్న,చదివిపియాలన్నా భయం ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. అందుకోసమే వివిధ షాపులలో పనిచేస్తున్న మహిళా కార్మికులకు కుటుంబ భారంతో ఎన్నో ఇబ్బందులతో గుమాస్తాలుగా పని చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. పనిచేసే దగ్గర భద్రత లేదు,వివక్షతతో చిన్న చూపు చూస్తూ నిత్యము భయాందోళనలతో చుట్టూ పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అసమానతలు అవకాశాలు మొదలుకొని లైంగిక వేధింపుల ద్వారా అనేక రకాల వివక్షల గురవుతూ నిత్యము వేధింపు లను ఎదుర్కొంటున్నారు. దేశానికి స్త్రీయే వెన్నుముకని మాటలు చెబుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేవుళ్లకు, బాబాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత
మహిళలకు ఈ దేశంలో కరువైందన్నారు, పనిచేసే దగ్గర పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం అమలు కాకపోగా పని భద్రత కరువై సర్వీసు బోనస్, ఈఎస్ఐ, పిఎఫ్ లాంటివి వర్తించకుండా అతి తక్కువ వేతనాలతో యాజమాన్యం శ్రమ దోచుకున్నటువంటి పరిస్థితి దాపరిస్తుందన్నారు. కుటుంబంలో ఎల్లని పరిస్థితిలో బయటికి వచ్చి ప్రైవేటు ఉద్యోగం చేస్తే యాజమాన్యం పాలకుల అండదండలతో, మహిళా కార్మికుల శ్రమను విపరీతంగా దోచుకుంటూ చిన్న చూపు చూస్తుందన్నారు. దేశంలో మహిళలు చిన్న పిల్లలపై పెరుగుతున్న అత్యాచారాలను కేంద్ర,బిజెపి ప్రభుత్వం అరికట్టాలని పని దగ్గర, ఉద్యోగాల దగ్గర,మహిళలకు తగిన రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమా,సరిత, అనసూయ,పద్మ స్వర్ణలత,పల్లవి,సుజాత,అపర్ణ,రమాదేవి,సుధారాణి, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version