నవోదయ విద్యాలయంలో విద్యార్థినిలపై లైంగిక వేధింపులు

# బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డ వైస్ ప్రిన్సిపల్.

# నలుగురు ఉపాధ్యాయులపై ఫోక్స్ చట్టం కేసు నమోదు..రిమాండ్ కు తరలింపు..

# వైస్ ప్రిన్సిపల్ పై కేసు నమోదుకు సిద్ధమవుతున్న పోలీస్ శాఖ…

# నిందితులు ఉపాద్యాయుల పేర్లు బయటపెట్టేందుకు నిరాకరించిన పోలీస్ అధికారులు..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి నేటిధాత్రి:

ఆశ్రమ,గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థినిలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి.కంటికి రెప్పల చూసుకునే అమాయక విద్యార్థినిలపై కన్నేసిన అధ్యాపకులు వారిని లొంగతీసుకోవడానికి ప్రయత్నించడం సభ్యాసమాజానికే మాయనిమచ్చగా తయారైంది.ఈ తతంగాలు జరుగుతున్నప్పటికీ వాటిని కప్పిపుచ్చేందుకు వైస్ ప్రిన్సిపాల్ సైతం ఆ కీచక ఉపాద్యాయులకే సహరించగా చివరికి పోలీసులు కామాందులపై ఫోక్స్ చట్టం కింద కేసులు నమోదై జైల్లో చిప్పకూడు తింటున్నారు.ఈ అమానుష్య సంఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో గల నవోదయ కేంద్రీయ విద్యాలయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో గల నవోదయ కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్,డాక్టర్లు ఇలా ఎన్నో ఉన్నత శిఖరాలకు అధిరోహించారు. అటువంటి విద్యాలయంలో ఎలాగోలా సీటు సంపాదించుకొని ఉన్నతంగా ఎదగాలని ఎంతో పట్టుదలతో చదువుతున్న విద్యార్థినులు నవోదయ విద్యాలయంలో అడుగుపెడితే, అక్కడ కొంతమంది కీచక ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, లైంగికంగా వేధించడం దీనిని వైస్ ప్రిన్సిపల్ వెనుక వేసుకుని రావడం జరుగుతున్న తీరు చటుచేసున్నది.విద్య బుద్దులు నేర్పుతూ తమ కన్న పిల్లల్లాగా చూసుకోవలసిన ఉపాధ్యాయులు, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తు, వారిని లైంగికంగా వేధిస్తున్నారు.ఇప్పటికే పలు విద్యాసంస్థలో కీచక ఉపాధ్యాయుల లీలలు వెలుగు చూశాం.తాజాగా కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ నవోదయ విద్యాలయంలో గతంలో రెండు, మూడు సార్లు విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించడం, ఈ విషయం విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పడం,తల్లిదండ్రులు వచ్చి ప్రశ్నించడంతో వైస్ ప్రిన్సిపల్ ఈ విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు.ఇదే ఆసరాగా తీసుకొని ఇటీవల మరోసారి విద్యార్థినిల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడడంతో విద్యార్థినులు, ఉపాధ్యాయుల పనితీరుపై, తల్లిదండ్రులకు వివరించగా చివరకు విద్యార్థినుల లైంగిక వేధింపులపై పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది.ఈ విషయంలో నలుగురు ఉపాధ్యాయులపై
పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు నిజాంసాగర్ ఎస్సై వెల్లడించారు.ఆ కీచక ఉపాధ్యాయులను విధుల నుంచి తొలగించారు. ఈ అమానుష్య ఘటన వారం రోజుల క్రితం జరగగా ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా ఒకపక్క పాఠశాల ఉన్నతాధికారులు, పోలీస్ శాఖ అధికారులు మరోపక్క మీడియాకు తెలవకుండా గోప్యంగా ఉంచినప్పటికీ ఆలస్యంగా వెలుగు వచ్చింది. ఈ లైంగిక సంఘటన పట్ల
నేటిధాత్రి ప్రతినిధి ఎస్ఐ శివకుమార్ కు వివరణ కోరగా ఫోక్సో యాక్ట్ కింద కిస్ నమోదు అయిన విషయం వాస్తవమేనని వారిని రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు.అంతకు ముందు ఈ సమాచారాన్ని మేము వెల్లడించకూడదు అంటూ నిజంసాగర్ ఎస్సై శివకుమార్ చేతులు ఎత్తివేసే ప్రయత్నం చేశారు.ఇలాంటి ఘటన దేశవ్యాప్తంగా కీచక ఉపాధ్యాయుల వివరాలను వెల్లడిస్తే మరోసారి ఇతర విద్యాసంస్థల్లో జరగకుండా ఉండే అవకాశం ఉన్నప్పటికీ,స్థానిక పోలీస్ శాఖ ఎందుకు ఈ వివరాలు మీడియాకు ఇవ్వడానికి వెనుకకు అడుగులు వేస్తుందో అంతు చిక్కడం లేదని పలువురు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే రాష్ట్రంలో విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయులను, అధ్యాపకులను అరెస్టు చేసిన ఘటనలు వెలుగు చూసాం.గతంలో కర్ణాటకలో,తమిళనాడులో మంత్రులపై, మంత్రుల కుమారులపై లైంగిక వేధింపుల కేసులు నమోదైతే అది బహిరంగంగా పత్రికలో వచ్చాయి. అంతకంటే ఈ కీచక ఉపాధ్యాయులు ఎక్కువనా? అంటూ ప్రజలు పెదవి విరుస్తున్నారు.చట్టం ముందు అందరూ సమానమే,ఎవరు తప్పు చేసిన కఠిన శిక్ష అనుభవించాల్సిందే అని ప్రజలు విద్యార్థినిల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. కానీ పోలీసులు మాత్రం లైంగిక వేధింపులకు పాల్పడ్డా ఉపాధ్యాయుల వివరాలు బహిర్గతం చేయడానికి ముందుకు రాకపోవడంతో పలు విమర్శలు వినిపిస్తున్నాయి.కానీ నిజాంసాగర్ నవోదయ విద్యాలయంలో మూడుసార్లు విద్యార్థుల పట్ల అసభ్యంగా ఉపాధ్యాయులు ప్రవర్తించిన తీరు వైస్ ప్రిన్సిపాల్ కు దృష్టికి విద్యార్థినిలు తీసుకుపోయినప్పటికీ,దానిని బయటకు పడనివ్వకుండా వైస్ ప్రిన్సిపల్ జాగ్రత్త పడ్డారు. ఈ విషయంలో వైస్ ప్రిన్సిపల్ పై కూడా కేసు నమోదు చేయాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

వైస్ ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలి..

నవోదయ కేంద్రీయ విద్యాలయంలో లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయులకు సహకరించిన వైస్ ప్రిన్సిపాల్ పై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాలు ప్రజాసంఘాలు కోరుతున్నాయి.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని వైస్ ప్రిన్సిపాల్ ను విధుల్లోంచి తొలగించాలని విద్యార్థి సంఘాలు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!