సమాజానికి సేవ చేయడం గొప్ప అవకాశం.

# జిల్లా విద్యాశాఖ అధికారిని వాసంతి

# జిల్లా స్థాయి 17వ గోనె మల్లయ్య మెమోరియల్ టాలెంట్ టెస్ట్

# పాల్గొన్న జిల్లా స్థాయి వివిధ ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి విద్యార్థులు

నర్సంపేట,నేటిధాత్రి :

నేటి ఆధునిక సమాజంలో సమాజానికి సేవ చేయడం గొప్ప అవకాశమని జిల్లా విద్యాశాఖ అధికారిని వాసంతి అన్నారు.17వ గోనె మల్లయ్య మెమోరియల్ టాలెంట్ టెస్ట్ కార్యక్రమాన్ని జిల్లా స్థాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు నర్సంపేట మండలంలోని లక్నపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు.ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారిని వాసంతి పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతితో పాటు మెమెంటో అందజేశారు.ఈ కార్యక్రమ నిర్వాహకుడు గోనే ప్రతాప్ అధ్వర్యంలో చేపట్టారు.17వ గోనె మల్లయ్య మెమోరియల్ టాలెంట్ టెస్ట్ నేపథ్యంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు డిఈఓ చేతుల మీదుగా చెన్నారావుపేట మండలం సూరిపెల్లి పాఠశాల విద్యార్థి చల్లా యశ్వంత్ మొదటి స్థానంలో నిలువగా
గోల్డ్ మెడల్ సాధించి రూ. 6 వేల నగదు,మేమొంటో అందుకున్నాడు.అలాగే వరంగల్ పట్టణంలోని నరేంద్ర నగర్ జిహెచ్ఎస్ విద్యార్థి సురేందర్ రెండవ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించి రూ. 4 వేల నగదు మెమెంటో చేజిక్కించుకున్నాడు.కాగా అదే వరంగల్ పట్టణంలోని నరేంద్ర నగర్ జిహెచ్ఎస్ విద్యార్థిని వి.మనస్విని మూడవ స్థానంలో నిలిచి రూ. 2 వేల నగదుతో పాటు మెమెంటోను డీఈఓ చేతుల మీదుగా తీసుకున్నది.లక్నపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధురి అధ్యక్షతన జరిగిన బహుమతి మహోత్సవ కార్యక్రమంలో డిఈఓ వాసంతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ అనేది వారి ప్రతిభను గుర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతీ విద్యార్థి మహోన్నత ఆలోచన కలిగి ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. నిత్యం సమాజంలో జరిగే సంఘటనల పట్ల మంచి విషయాలను మాత్రమే గ్రహిస్తూ చెడును ద్వేషించాలని
తెలిపారు.ఇలాంటి అవకాశాన్ని ప్రతీ ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. త్వరలో జరగబోయే పదవ తరగతి పరీక్షలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని వాసంతి విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథి డిసిఈబి సెక్రెటరీ జి కృష్ణమూర్తి,గోనె ఉమాదేవి,పాఠశాల ఉపాధ్యాయులు కొమురయ్య,అర్చన,సారంగపాణి,భవాని,వివిధ ప్రభుత్వ పాఠశాలల అధ్యాపకులు,దుగ్గొండి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దోర్నాల రమేష్.తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version